Viral News

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం: గుండెపోటుతో ప్రముఖ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రముఖ నటుడు, స్టార్ విలన్ ప్రదీప్ సింగ్ రావత్ (74) గుండెపోటుతో కన్నుమూశారు. తన భయంకరమైన చూపులతో, పవర్‌ఫుల్ వాయిస్‌తో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్‌గా మెప్పించిన ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

‘భిక్షూ యాదవ్’ గా చెరగని ముద్ర: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ సినిమాలో ‘భిక్షూ యాదవ్’ పాత్రను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ ఒక్క క్యారెక్టర్‌తో ఆయన టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఛత్రపతి, గజిని, లక్ష్మీ, భద్ర, యోగి, దేశముదురు, పంచాక్షరి వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తనదైన విలనిజంతో టాలీవుడ్‌లో గొప్ప విలన్లలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేక పేజీ లిఖించుకున్నారు.

చివరి సినిమా ఇదే..Chhaava.. ఈ టాలెంటెడ్ నటుడు.. 1952లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలు భాషల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆయన చివరగా తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కనిపించారు.

ఒకప్పుడు తన విలనిజంతో హీరోలకు ముచ్చెమటలు పట్టించిన ప్రదీప్ రావత్ ఇక లేరనే వార్త అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ‘సినీ దావత్ ‘ తరపున ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నాం. ప్రదీప్ రావత్ గారి సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *