విజయ్ – రష్మిక పెళ్లి ఈరోజేనా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసినప్పటి నుండి, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే, గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త దావానలంలా వ్యాపిస్తోంది. అదేంటంటే.. సరిగ్గా ఈరోజు (ఫిబ్రవరి 2, 2026) వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని! ఒక వైరల్ వీడియో మరియు కొన్ని ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చూసి నెటిజన్లు ఇది నిజమే అని నమ్మేశారు.
అసలు మ్యాటర్ ఏంటంటే: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “ఫిబ్రవరి 2 పెళ్లి” వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. విజయ్ దేవరకొండ టీమ్ గాని, రష్మిక టీమ్ గాని దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం నెటిజన్లు మరియు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ సృష్టించిన రూమర్ మాత్రమే అని స్పష్టమైంది. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.
మరి ముహూర్తం ఎప్పుడు?: అయితే, నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు.. వీరి పెళ్లి గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, వీరి పెళ్లికి సంబంధించిన పనులు సైలెంట్‌గా జరుగుతున్నాయట. ఈ నెలాఖరులో, అంటే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని గట్టిగా వినిపిస్తోంది.
ఉదయపూర్ ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని టాక్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై రౌడీ బాయ్ గాని, నేషనల్ క్రష్ గాని అధికారికంగా స్పందించే వరకు ఇవన్నీ గాసిప్సే! ఏది ఏమైనా, వీరిద్దరూ ఒక్కటవ్వాలని ఫ్యాన్స్ మాత్రం కోరుకుంటున్నారు.
మరి దీని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో మాతోటి పంచుకోండి
