రాజా సాబ్ ఓటీటీ వెర్షన్‌లో మార్పులు..ఫ్యాన్స్‌కి ప్రభాస్ కొత్త గిఫ్ట్!
రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వచ్చిన హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab) థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యింది. ఫిబ్రవరి 6 నుండి ‘JioCinema’ (JioHotstar) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే థియేటర్‌లో చూసిన సినిమాకి, ఓటీటీలో రాబోయే సినిమాకి కొన్ని మార్పులు ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు ఇవే..
1. ఆ 8 నిమిషాల సీన్స్ యాడ్ చేశారా?: సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు, ట్రైలర్‌లో చూపించిన ప్రభాస్ ‘ముసలి గెటప్’ (Old Look) సీన్స్ సినిమాలో లేవని ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. టెక్నికల్ సమస్యల వల్ల అవి ప్లే అవ్వలేదని డైరెక్టర్ మారుతి చెప్పారు. అయితే రిలీజ్ అయిన వారం తర్వాత ఆ 4 నుండి 8 నిమిషాల సీన్స్‌ని థియేటర్లలో యాడ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలో రాబోయే వెర్షన్‌లో ఈ సీన్స్ మొదటి నుండే ఉంటాయని సమాచారం. అంటే మనం రాజా సాబ్ వింటేజ్ లుక్‌ని ఫుల్ లెంగ్త్‌లో ఎంజాయ్ చేయొచ్చు.
2. వీఎఫ్ఎక్స్ (VFX) కరెక్షన్స్: థియేట్రికల్ రిలీజ్ టైమ్‌లో కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్‌లో గ్రాఫిక్స్ పై ట్రోల్స్ వచ్చాయి. ఓటీటీ వెర్షన్ కోసం ఆయా షాట్స్ లో కలర్ గ్రేడింగ్ (Color Grading) మరియు చిన్న చిన్న గ్రాఫిక్స్ లోపాలను సరిదిద్దినట్లు తెలుస్తోంది. ఫైనల్ అవుట్‌పుట్ ఇప్పుడు మరింత క్వాలిటీగా ఉండబోతోంది.
3. అన్-కట్ వెర్షన్ (Uncut Version)?: సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు థియేటర్లలో కొన్ని వైలెన్స్ సీన్స్ (ముఖ్యంగా తల నరికే సీన్) బ్లర్ చేయడం లేదా ట్రిమ్ చేయడం జరిగింది. కానీ ఓటీటీలో ఇలాంటి నిబంధనలు పెద్దగా ఉండవు కాబట్టి, ఆ ఒరిజినల్ ‘అన్-కట్’ సీన్స్‌ని యధావిధిగా ఉంచే అవకాశం ఉంది. అలాగే రన్-టైమ్ విషయంలో కూడా కోతలు లేకుండా ఫుల్ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఫైనల్ గా: థియేటర్‌లో చిన్న చిన్న లోపాలతో ఇబ్బంది పడిన వారికి, ఓటీటీ వెర్షన్ ఒక ఫ్రెష్ ఎక్స్-పీరియెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మార్పులతో ‘రాజా సాబ్’ డిజిటల్ రికార్డులు కొడతాడేమో చూడాలి!
మరి మీరు కూడా మళ్ళి OTT లో ఏం మార్పులు చేసారో కామెంట్ రూపం లో పంచుకోండి
