Reviews

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ: పవన్ కళ్యాణ్ ఊరమాస్ జాతర.. పెర్ఫార్మెన్స్ బద్దలైపోయింది!

నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా, అశుతోష్ రాణా, పార్తిబన్ ,గౌతమి తదితరులు. దర్శకత్వం: హరీష్ శంకర్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ (పాటలు), థమన్ (నేపథ్య సంగీతం) నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ (మైత్రీ మూవీ మేకర్స్) విడుదల తేదీ: 19 మార్చి, 2026 సినీ దావత్ రేటింగ్: 2.5/5

కథ (Story): భగత్ సింగ్ (పవన్ కళ్యాణ్) ఒక నిజాయితీ గల, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. చట్టం తన పని తాను చేసుకుపోవాలి, లేదంటే తన తుపాకీ మాట్లాడుతుంది అనే తత్వం ఉన్న వ్యక్తి. తన పరిధిలో జరిగే అన్యాయాలను అడ్డుకునే క్రమంలో ఒక పవర్ ఫుల్ విలన్ గ్యాంగ్ తో భగత్ సింగ్ కు గొడవలు వస్తాయి. ఈ పోరాటంలో భగత్ సింగ్ కు ఎదురైన సవాళ్లు ఏంటి? శ్రీలీల, రాశీ ఖన్నా ఈ కథలో ఎలా భాగమయ్యారు? విలన్ సామ్రాజ్యాన్ని ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా కూల్చేశాడు? అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు (Performances):

  • పవన్ కళ్యాణ్: ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. పవన్ ఎనర్జీ, స్వాగ్, ఆటిట్యూడ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు రావాల్సిందే. ముఖ్యంగా తెలంగాణ యాసలో పవన్ చెప్పిన మాస్ డైలాగ్స్ కు థియేటర్లలో ఈలలు పడుతున్నాయి. ఎమోషనల్ సీన్స్ లోనూ డిప్యూటీ సీఎం తన మార్క్ చూపించారు.
  • శ్రీలీల & రాశీ ఖన్నా: శ్రీలీల తనదైన బబ్లీ యాక్టింగ్ తో పర్వాలేదనిపించింది ఇక పవన్ – శ్రీలీల మధ్య వచ్చే ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. రాశీ ఖన్నా పాత్రకి ప్రాముఖ్యత అంతగా లేదు.
  • మిగతా తారాగణం: విలన్ గా చేసిన పార్తీబన్ ను ఇంకా బాగా వాడుకోవచ్చు అనిపించింది మిగితా నటులు తమ పాత్రలతో రానించారు, అలాగే గౌతమి, KS రవి కుమార్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం (Technical Aspects):

  • దర్శకత్వం: హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రెజెంట్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. “ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” అన్న మాటను నిలబెట్టుకున్నాడు.కానీ సామాన్య సినిమా ప్రేక్షకులకు మాత్రం సినిమా ఆంత నచ్చక పోవచ్చు
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు స్క్రీన్ మీద చూడటానికి చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక థమన్ (Thaman) ఇచ్చిన BGM ,మాత్రం OG రేంజ్ లో లేదనిపించింది. పవన్ యాక్షన్ సీన్స్ ను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోవడానికి ప్రయతించాడు.
  • సినిమాటోగ్రఫీ & నిర్మాణ విలువలు: విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించిన విషయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ (+):

  • పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ & స్క్రీన్ ప్రెజెన్స్
  • హరీష్ శంకర్ మాస్ డైలాగ్స్
  • ఇంటర్వెల్ బ్యాంగ్ & క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్ (-):

  • కథలో కొత్తదనం లేకపోవడం (రొటీన్ టెంప్లేట్)
  • సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదించిన స్క్రీన్ ప్లే

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. కొత్త కథను ఆశించి వెళ్లకుండా, కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్, హరీష్ శంకర్ మార్క్ ఎలివేషన్స్ చూడాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాంటిది. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని పూర్తిగా రిపీట్ చేయకపోయినా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడం మాత్రం ఖాయం. ఈ వీకెండ్ కి థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి ఇదొ కూడా ఒక ఆప్షన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *