Viral News

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను వదిలేసి బాలీవుడ్ సినిమాకు మన స్టార్స్ ఎందుకు భజన చేస్తున్నారు?

ఒకప్పుడు పక్క భాషల సినిమాలు మన దగ్గర రిలీజ్ అయితే, మన హీరోల సినిమాలకు అడ్డు వస్తున్నాయని టాలీవుడ్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు కోపపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. మన టాలీవుడ్ స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు.. మన సొంత తెలుగు సినిమాను పక్కన పెట్టి మరీ పక్క ఇండస్ట్రీ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.

మార్చి 19న బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ జరిగింది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’, మరోవైపు రణవీర్ సింగ్, ఆదిత్య ధార్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge). అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరూ పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, అదే సమయంలో బాలీవుడ్ సినిమా ‘ధురంధర్ 2’ కు బ్రహ్మరథం పట్టడం! అసలు టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

మెగా హీరోల సైలెన్స్.. పవన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడని నిజం!

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఫ్యాన్స్‌ను అత్యంత బాధపెట్టిన విషయం మెగా హీరోల వ్యవహారశైలి. సొంత బాబాయ్, మామ అయిన పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే మెగా హీరోల నుండి కనీసం ఒక ‘ఆల్ ది బెస్ట్’ ట్వీట్ కూడా రాలేదు. కానీ, ‘ధురంధర్ 2’ విషయానికి వస్తే మాత్రం వీరు ముందు వరుసలో నిలబడ్డారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్చి 18నే ‘ధురంధర్ 2’ చూసి.. “దేశభక్తికి స్వాగ్ తోడైంది.. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా.. రణవీర్ సింగ్ ఆన్ ఫైర్” అంటూ ఒక రేంజ్ లో ట్వీట్ వేశారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా “ధురంధర్ 2 చాలా రఫ్, గ్రిప్పింగ్ అండ్ ఇంపాక్ట్ ఫుల్.. ఆదిత్య ధార్ విజన్ అద్భుతం” అంటూ రణవీర్ కి, చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. బాలీవుడ్ వాళ్లతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం కోసం సొంత ఫ్యామిలీ సినిమాని పక్కన పెడతారా అని నెటిజన్లు, ముఖ్యంగా పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

పాన్ ఇండియా ఇమేజ్ కోసమేనా ఈ బాలీవుడ్ భజన?

ఇక మన టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మహేష్ బాబుల పరిస్థితి కూడా అంతే.

  • జూనియర్ ఎన్టీఆర్: “ధురంధర్ టీమ్ కి బిగ్ సెల్యూట్.. రణవీర్ యాక్టింగ్ ఒక మాస్టర్ క్లాస్. ఆదిత్య ధార్ విజన్ కి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలి” అని పెద్ద పోస్ట్ పెట్టారు.
  • మహేష్ బాబు: “పర్ఫెక్ట్ ప్రెసిషన్ తో తీసిన సినిమా.. అవుట్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్” అంటూ ట్వీట్ చేశారు.
  • ఎస్.ఎస్. రాజమౌళి: మన జక్కన్న రాజమౌళి గారు కూడా “పార్ట్ 1 కంటే పార్ట్ 2 అద్భుతంగా ఉంది.. 4 గంటల సినిమా తీయడానికి డైరెక్టర్ ఆదిత్య ధార్ కి గట్స్ ఉండాలి” అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.

వీళ్లంతా ‘ధురంధర్ 2’ కి ఇచ్చిన సపోర్ట్ లో కనీసం పది శాతం కూడా మన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు ఇవ్వలేదు. రేపు తమ సినిమాలు నార్త్ లో రిలీజ్ అయినప్పుడు బాలీవుడ్ సపోర్ట్ కావాలనే ఉద్దేశ్యంతోనే వీళ్ళంతా ఇలా చేస్తున్నారా అన్నది ఇప్పుడు ఆడియన్స్ మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న.

కుర్ర హీరోలు కూడా బాలీవుడ్ జపమే!

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ సైతం మార్చి 18నే “రేపటి నుండి ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్ జరగబోతోంది.. 4 అక్షరాలు.. భారత్ మాతా కీ జై” అంటూ ట్వీట్ వేశారు. అంతేకాదు, ఆయన థియేటర్ కి వెళ్లి సైలెంట్ గా సినిమా చూసి బయటకు వస్తున్న వీడియో కూడా వైరల్ అయింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా “రణవీర్ సింగ్ బ్రో, ప్రతి ఫ్రేమ్ ని ఓన్ చేసుకున్నావ్” అంటూ ట్వీట్ వేశాడు.

నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు టాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కానీ ఈసారి వాళ్ళు కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో సైలెంట్ అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

టాలీవుడ్‌లో ఏకత్వం కేవలం మాటలకేనా?

సినిమా బాగుంటే పొగడటంలో తప్పు లేదు. కళకు భాషా భేదం లేదు. కానీ సొంత ఇండస్ట్రీ సినిమాను, అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ సినిమాను పూర్తిగా ఇగ్నోర్ చేసి, దానికి పోటీగా ఉన్న ఒక హిందీ సినిమాకి మాత్రమే టాలీవుడ్ అంతా ఏకతాటిపై వత్తాసు పలకడం ఎక్కడో తేడా కొడుతోంది. టాలీవుడ్ లో హీరోల మధ్య ఏకత్వం కేవలం మాటలకే పరిమితమా? లేక పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ కి మధ్య ఏదైనా సైలెంట్ గ్యాప్ నడుస్తోందా? కాలమే సమాధానం చెప్పాలి.

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన స్టార్స్ చేసింది కరెక్టేనా? కింద కామెంట్స్ లో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *