రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వీరంగం.. మద్యం మత్తులో యాక్సిడెంట్, కారు సీజ్!
గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచిన అతని మాజీ ప్రియురాలు ‘లావణ్య’ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి ఏకంగా మద్యం మత్తులో కారు నడుపుతూ ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా, అడ్డుకున్న స్థానికులతో, పోలీసులతో నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.
మద్యం మత్తులో బైకర్‌ను ఢీకొట్టిన లావణ్య
వివరాల్లోకి వెళితే.. మల్కాపూర్ మండలం మల్లెపల్లి సమీపంలో లావణ్య తన కారులో ప్రయాణిస్తోంది. అయితే ఆమె తీవ్రమైన మద్యం మత్తులో ఉండటంతో, కారు అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత తప్పు తెలుసుకుని కారు ఆపాల్సింది పోయి.. బాధితుడిని అక్కడే వదిలేసి కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.
గ్రామస్తులతో వాగ్వాదం.. కారులో మద్యం బాటిళ్లు?
లావణ్య కారు ఆపకుండా పారిపోతుండటాన్ని గమనించిన మల్లెపల్లి గ్రామస్తులు, వెంబడించి మరీ ఆమె కారును అడ్డుకున్నారు. కిందకు దిగి బాధితుడికి సారీ చెప్పాలని స్థానికులు డిమాండ్ చేయగా.. లావణ్య వారితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. “నా ఊరు ఇది.. నన్నే ఆపుతారా?” అంటూ కారులో కూర్చునే దౌర్జన్యం చేసింది. ఆ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అంతేకాకుండా, లావణ్య కారులో పలు మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులతోనూ అదే తీరు.. ఫైనల్ గా కారు సీజ్
స్థానికులు ఎంత చెప్పినా లావణ్య వినకపోవడంతో, వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కూడా లావణ్య కాసేపు వాగ్వాదానికి దిగడం గమనార్హం. పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా.. రిజల్ట్ ‘పాజిటివ్’ అని వచ్చింది. అంటే ఆమె మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడిపినట్లు నిర్ధారణ అయింది.
దీంతో పోలీసులు లావణ్యపై డ్రంక్ అండ్ డ్రైవ్, మరియు యాక్సిడెంట్ చేసినందుకు కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఒకప్పుడు రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని, తనకు న్యాయం కావాలని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య.. ఇప్పుడు ఇలా బాధ్యతారాహిత్యంగా మద్యం తాగి యాక్సిడెంట్ చేయడం, పబ్లిక్ మీద దౌర్జన్యానికి దిగడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
మరి ఈ ఘటనపై రాజ్ తరుణ్ ఏమైనా స్పందిస్తాడా? పోలీసుల విచారణలో ఇంకేం తేలనుంది? అన్నది వేచి చూడాలి. ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి.
