పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఔట్? ఉగాదికే టార్గెట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ అనగానే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక షాకింగ్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ మార్పు? (DSP Out – Thaman In?): ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. కానీ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ బజ్ ప్రకారం.. డీఎస్పీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని టాక్. ఆయన ప్లేస్‌లోకి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ (SS Thaman) ఎంట్రీ ఇచ్చారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే డీఎస్పీ తప్పుకున్నారని ఒక వర్గం అంటుంటే.. ఇంకా సాంగ్స్ మాత్రం డీస్పీ చేసి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థమన్ తో చేపిస్తున్నారు అందుకు గల కారణం ఏంటి అంటే రిలీజ్ డేట్ మారడం అనుకున్న దానికంటే 15 రోజులు ముందుకు జరగడం దాని వాళ్ళ టైం లేకపోవడంతో థమన్ తీసుకున్నారు అని సమాచారం హరీష్ శంకర్ కు థమన్ వర్కింగ్ స్టైల్ తో ఉన్న సింక్ వల్ల ఈ మార్పు జరిగిందని ఇంకొందరు అంటున్నారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ – థమన్ కాంబో అంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఉగాది కానుకగా రిలీజ్? (Release Date Buzz): మరోవైపు సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని తెలుగు వారి పండుగ ఉగాది (Ugadi) కానుకగా మార్చి 19న థియేటర్లలో దించబోతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్‌కు పండుగ ముందుగానే వచ్చినట్లు లెక్క.
బాక్సాఫీస్ బద్దలే: శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” అన్న డైలాగ్ కు తగ్గట్టే థమన్ మ్యూజిక్ కూడా తోడైతే బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవ్వడం ఖాయం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఈ మార్పు పై మీరు ఏమంటారు కామెంట్ రూపంలో మాతో పంచుకోండి.
