“నా విజయ రహస్యం నా టాలెంట్ కాదు.. నువ్వే!”.. భార్య సురేఖ గురించి చిరు ఎమోషనల్ లవ్ లెటర్!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వెండితెరపై ఎంతో మందికి ఆదర్శం. కానీ ఆయన రియల్ లైఫ్ లో మాత్రం.. తన భార్య సురేఖ (Surekha Konidela) గారే తనకు ఆదర్శం అని, తన విజయానికి అసలు కారణం ఆమే అని చెప్పడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈరోజు (ఫిబ్రవరి 18) సురేఖ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు సోషల్ మీడియాలో రాసిన ఒక ఎమోషనల్ పోస్ట్ అందరి గుండెలను బరువెక్కిస్తోంది.

46 ఏళ్ల బంధం (Since 1980):
“ఫిబ్రవరి 20, 1980న మనం ఒక్కటైన రోజు నుంచి.. నువ్వే నా అతిపెద్ద బలం” అంటూ చిరు తన ప్రేమలేఖను మొదలుపెట్టారు. ఈరోజు సురేఖ గారి పుట్టినరోజు జరుపుకుంటూనే.. మరో రెండు రోజుల్లో రాబోయే తమ పెళ్లి రోజు (Wedding Anniversary) శుభాకాంక్షలు కూడా ముందుగానే తెలిపారు.

ఆమె త్యాగమే నా విజయం:
చిరంజీవి గారు తన పోస్ట్ లో రాసిన ఈ మాటలు ప్రతి భర్తని ఆలోచింపజేసేలా ఉన్నాయి:
“ఎవరైనా నా విజయ రహస్యం ఏంటి అని అడిగితే.. అది నా టాలెంట్ లేదా నా కష్టార్జితం అని చెప్పను. నా సక్సెస్ సీక్రెట్ ‘నువ్వే’ (It is You) అని గర్వంగా చెప్తాను. ఎందుకంటే ఇంటి బాధ్యతలన్నీ నువ్వు నీ భుజాల మీద వేసుకున్నావు కాబట్టే.. నేను నా సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టగలిగాను” అని చిరు ఎమోషనల్ అయ్యారు.

కుటుంబానికి ఆమె మూలస్తంభం:
సురేఖ గారు కేవలం చిరంజీవి భార్యగానే కాకుండా, కొణిదెల కుటుంబానికి (Mega Family) ఒక అతుకురాయిలా నిలిచారని చిరు కొనియాడారు. “నా తల్లిదండ్రులను నీ సొంత తల్లిదండ్రులుగా చూసుకున్నావు. ప్రతి కష్టంలో, ప్రతి సంబరంలో మనందరినీ కలిపి ఉంచింది నువ్వే. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు.. నా బలం, నా ప్రశాంతత” అని చిరు రాసుకొచ్చారు.

వైరల్ అవుతున్న పోస్ట్:
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక మెగాస్టార్ అయి ఉండి, తన భార్యకు ఇంతలా క్రెడిట్ ఇవ్వడం చూసి.. “రియల్ జెంటిల్ మ్యాన్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్ డే సురేఖ గారు! మీరు కూడా కామెంట్ బాక్స్ లో విషెష్ చెప్పండి.
