‘హ్యాపీ’కి 20 ఏళ్లు.. ఆ రోజులని గుర్తు చేసుకుంటూ బన్నీ ఎమోషనల్ ట్వీట్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన చిత్రం ‘హ్యాపీ’ (Happy). కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు (20 Years) పూర్తయింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

బన్నీ ట్వీట్ విశేషాలు: “హ్యాపీ సినిమాకి 20 ఏళ్లు.. నా సినీ ప్రయాణంలో నేను అత్యంత ఎంజాయ్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. ఇంత మంచి విజన్ ఇచ్చిన డైరెక్టర్ కరుణాకరన్ గారికి, నా అద్భుతమైన కో-స్టార్ జెనీలియాకి స్పెషల్ థాంక్స్” అంటూ బన్నీ రాసుకొచ్చారు.

యువన్ మ్యూజిక్ మ్యాజిక్: ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja) అందించిన హార్ట్ టచింగ్ మ్యూజిక్‌ని బన్నీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అలాగే విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయి నటనను కూడా కొనియాడారు.

గీతా ఆర్ట్స్ బ్యాకింగ్: ఈ ప్రాజెక్ట్‌ని వెనకుండి నడిపించిన తన తండ్రి అల్లు అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ సంస్థకు బన్నీ కృతజ్ఞతలు తెలిపారు. అప్పట్లో లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా యూత్‌ని విశేషంగా ఆకట్టుకుంది.

మరి మీకు హ్యాపీ సినిమా నచ్చిందా.. ఏ క్లాస్ లో ఉన్నప్పుడు చూసారు నచ్చితే ఎన్నిసార్లు చూసారు మాతో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.
