Viral News

అఫీషియల్: పెళ్లి పీటలు ఎక్కుతున్న విజయ్ దేవరకొండ – రష్మిక.. ‘VIROSH’ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

టాలీవుడ్ క్యూట్ కపుల్, రూమర్డ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు తమ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. గత కొన్ని ఏళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లిని అధికారికంగా (Officially Confirmed) ప్రకటించారు.

ఏంటి ఈ ‘VIROSH’ (విరోష్)?
విజయ్, రష్మిక తమ ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. “మేము మా కోసం ఏ ప్లాన్ చేసుకోకముందే, మీరు మమ్మల్ని ప్రేమతో ఒకటి చేశారు. మా ఇద్దరి పేర్లు కలిపి ‘VIROSH’ (Vijay + Rashmika = VIROSH) అని పిలిచారు. ఆ ప్రేమకు గౌరవంగా మా కలయికకు ‘The Wedding of VIROSH’ అని పేరు పెట్టుకుంటున్నాము. మీరు ఎప్పటికీ మాలో ఒక భాగమే” అని రాసుకొచ్చారు.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో స్క్రీన్ మీద మ్యాజిక్ చేసిన ఈ జంట.. ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఒకటి కాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతి త్వరలోనే వీరి పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
మరి దీని మీరు ఏమంటారు కామెంట్ లో మాతో పంచుకోండి అలాగే మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం Cine Dawat ను ఫాలో అవుతూ ఉండండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *