అనిల్ రావిపూడికి చిరు ‘మెగా’ గిఫ్ట్.. హరీష్ శంకర్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు డైరెక్టర్లకు మధ్య ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి చిరంజీవి ఒక ఖరీదైన కారును బహుమతిగా పంపించారు.
మెగా బహుమతి – మహదానందం: ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ చూసి షాక్ అయిన అనిల్ రావిపూడి, వెంటనే సోషల్ మీడియాలో (X) స్పందించారు. చిరుతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. “మెగా బహుమతి… మహదానందం.. మనో ధైర్యం.. ధనా ధన్” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
హరీష్ శంకర్ ఎంట్రీ – UBS లీక్? అయితే ఈ ట్వీట్ చూసిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అనిల్ రావిపూడిని ఉద్దేశించి.. “తమ్ముడు.. త్వరగా ఆ కారేసుకొని నా దగ్గరికి వస్తే…. అందులోనే UBS (ఉస్తాద్ భగత్ సింగ్) కొత్త సాంగ్ వింటూ అలా డ్రైవ్ వేద్దాం.. ఇదే నీకు నా గిఫ్ట్” అని కామెంట్ చేశారు.
ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ: హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ రెడీ అయిపోయిందని, త్వరలోనే అప్డేట్ రాబోతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. మొత్తానికి చిరు గిఫ్ట్ ఒక ఎత్తైతే, హరీష్ శంకర్ ఇచ్చిన ఈ చిన్న హింట్ మరో ఎత్తు!
దీని పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం లో రాయండి
